అర్హుల ఓట్లను తొలగిస్తున్నరు..బీజేపీ తీరుపై మంత్రి పొన్నం ఫైర్‌‌‌‌‌‌‌‌

అర్హుల ఓట్లను తొలగిస్తున్నరు..బీజేపీ తీరుపై మంత్రి పొన్నం ఫైర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ప్రభుత్వం అర్హుల ఓట్లను తొలగిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. గురువారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా పారిజాత నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పొన్నం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సర్​పై సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం తప్పుడు సమాచారం ఇస్తున్నదని విమర్శించారు. 

సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ బేషరతుగా క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం పట్ల కేంద్రానికి గౌరవం లేదని, ప్రజలు దీన్ని క్షమించరని అన్నారు.