- ఉద్యమకారుల వివరాల నమోదుకు వెబ్సైట్ ప్రారంభం
- కృతజ్ఞతలు చెప్పిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
సైఫాబాద్, వెలుగు: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఉద్యమకారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు గుర్తింపు కమిటీ వెబ్సైట్ను ప్రారంభించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారని ఆరోపించారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారన్నారు. లక్ష మంది ఉద్యమకారులను గుర్తించి, వారికిచ్చిన హామీలను నెరవేరిస్తే మరో ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
