- బొగ్గు కృత్రిమ కొరత సృష్టించి, ‘భోత్రా లాజిస్టిక్స్’తో చీకటి ఒప్పందం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు
- బొగ్గు కొనుగోళ్లపై దర్యాప్తునకు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో ఏకంగా రూ.3 వేల కోట్ల భారీ స్కామ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్తెరలేపిందని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ఆరోపించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. దేశంలో బొగ్గు వనరులు పుష్కలంగా ఉన్నా, విదేశీ బొగ్గు దిగుమతికి మొగ్గు చూపడం వెనుక భారీ స్కామ్ దాగి ఉందన్నారు. రాష్ట్రంలో బొగ్గు, విద్యుత్కృత్రిమ కొరత సృష్టించి, భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో సీఎం చీకటి ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. విదేశీ బొగ్గు దిగుమతి పేరుతో టన్నుకు ఏకంగా రూ.1,500 చొప్పున రూ.3 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు స్కెచ్ వేశారన్నారు. 2023–24లో సింగరేణిలో సుమారు 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా.. 2025–26 నాటికి అది ఏకంగా 58 మిలియన్ టన్నులకు ఎందుకు పడిపోయిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు.
ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైనా అక్కడి నుంచి సరఫరా ఎందుకు పెంచడం లేదని, మహానది ప్రాంతం నుంచి బొగ్గు తెచ్చుకునే అవకాశాలున్నా ఎందుకు వాడుకోవడం లేదని ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌పై ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలు పచ్చి అబద్ధాలన్నారు. 2018 ఫిబ్రవరి 15న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. యాదాద్రి ప్లాంట్‌కు ఏటా 14 మిలియన్ టన్నుల జీ9 గ్రేడ్ బొగ్గు కేటాయింపులు జరిగాయని తెలిపారు. అలాంటప్పుడు నాణ్యత, కొరత పేరుతో విదేశీ బొగ్గు కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో చెప్పాలన్నారు. బొగ్గు దిగుమతి ప్రతిపాదనలు, టెండర్లు, కొనుగోలు పరిమాణం, ధరల అంచనాలపై శ్వేతపత్రం రిలీజ్చేయాలని, ఈ కుంభకోణం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తుల పాత్రపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌చేశారు.
