రాష్ట్రంలో ప్రతి పనికీ 15% కమీషన్ : టీఆర్ఎస్ చీఫ్ కవిత

రాష్ట్రంలో ప్రతి పనికీ 15% కమీషన్ : టీఆర్ఎస్ చీఫ్ కవిత
  • సీఎంవో నుంచే అధికారులు, కాంట్రాక్టర్లకు బెదిరింపులు: టీఆర్ఎస్​ చీఫ్ ​కవిత ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)  కమీషన్ల దందాకు అడ్డాగా మారిందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్  కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి పనికీ ఏకంగా 15 శాతం కమీషన్ ఇవ్వాలంటూ సీఎంవో నుంచే అధికారులు, కాంట్రాక్టర్లకు బెదిరింపులు వెళ్తున్నాయని గురువారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నది ప్రజాపాలన కాదని, ముమ్మాటికీ లూటీ, దోపిడీ పాలన అని విమర్శించారు. 

ఎలాంటి అర్హతలు లేని వ్యక్తులకు సైతం.. కమీషన్లు ముడతాయన్న ఏకైక కారణంతో భారీ పనులను కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్సై శ్రీకాంత్‌‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.