న్యూఢిల్లీ: టీమిండియా తుది జట్టు నుంచి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పించడం సరైంది కాదని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సిరీస్‌లో కుల్దీప్ తుది జట్టులో ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవని విమర్శించాడు.
‘కుల్దీప్ గూగ్లీ, లెగ్ స్పిన్‌ను విండీస్ బ్యాటర్లు ఆడలేకపోతున్నారు. అలాంటి బౌలర్‌ను పక్కనబెట్టడం ఆశ్చర్యకరం. అతను ఉంటే మ్యాచ్‌లో 15, 20 రన్స్ తేడా ఉంటుంది. రాంచీ ఓటమికి కుల్దీప్ కారణమనే రీతిలో వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ కళ్లు తెరవాలి’ అని అశ్విన్ పేర్కొన్నాడు. లక్నో, రాంచీలలో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ను.. ఇండోర్, హైదరాబాద్‌లలో జరిగిన తర్వాతి మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.
