- 29 జిల్లాల్లో యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు ఐఐటీ–జేఈఈ, నీట్, క్లాట్ ప్రవేశపరీక్షల కోసం నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు సర్కారు 29 జిల్లాల్లో ‘యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల మినహా మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి వీటిని ప్రారంభిస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,920 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా.. 20 కేంద్రాల్లో జేఈఈ/నీట్, మరో 9 కేంద్రాల్లో క్లాట్ శిక్షణ అందించనున్నారు. ఈ కోచింగ్ ప్రోగ్రామ్ కోసం ప్రభుత్వం మొత్తం రూ.3.73 కోట్లను మంజూరు చేసింది. జేఈఈ/నీట్ సెంటర్లకు ఆరుగురు, క్లాట్ సెంటర్లకు ఐదుగురు చొప్పున నిపుణులైన ఫ్యాకల్టీని ఎంపిక చేసి 152 పనిదినాల పాటు గంటల ప్రాతిపదికన క్లాసులు, అసైన్మెంట్లు, డౌట్ క్లియరింగ్, మాక్ టెస్టులు నిర్వహిస్తారు.
