40 దేశాల నుంచి  చమురు కొని.. అమెరికా, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎగుమతి

40 దేశాల నుంచి  చమురు కొని.. అమెరికా, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎగుమతి
  •  పెట్రోలియం సప్లయ్‌‌‌‌‌‌‌‌లో కీలకంగా మారిన భారత్‌‌‌‌‌‌‌‌
  •     రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ నుంచి పెరిగిన ఎగుమతులు 
  •     టర్కీ, బ్రూనైల నుంచి కూడా సప్లయ్‌‌‌‌‌‌‌‌ పెరిగిందన్న సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఏ


న్యూఢిల్లీ:   వెస్ట్రన్ దేశాల పెట్రోలియం అవసరాలను తీర్చడంలో  ఇండియా కీలకంగా మారిందని   ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్  (సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఏ) తన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  దాదాపు 40  దేశాల నుంచి క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేస్తూ, తన రిఫైనరీలను ఫుల్ కెపాసిటీలో నడిపిస్తోందని,   ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్‌‌‌‌‌‌‌‌ను  కొనుగోలు చేసి,  రిఫైన్ చేసి పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ వంటి పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  వెస్ట్రన్ దేశాలకు ఎగుమతి చేస్తోందని  తెలిపింది. మనతో పాటు టర్కీ, బ్రూనై దేశాల్లోని రిఫైనరీలు కూడా వెస్ట్రన్ దేశాలకు పెట్రోలియం సరఫరా పెంచాయని వివరించింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల ధరలు గరిష్టాలకు చేరిన  విషయం తెలిసిందే.  సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఏ రిపోర్ట్ ప్రకారం,  అమెరికా, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియాలకు  పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  భారత్, టర్కీ, బ్రూనై దేశాల్లోని రిఫైనరీలు ఎక్కువగా సరఫరా చేస్తున్నాయి. ఇవి ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 1 బిలియన్ యూరోలు (దాదాపు రూ.10,700 కోట్ల) విలువైన చమురు ఉత్పత్తులను ఈ దేశాలకు రవాణా చేశాయని అంచనా.   ఆగస్టుతో పోలిస్తే 43 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో అత్యధిక భాగం యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకే ఎగుమతి అయింది. ఈయూ దేశాలు 667 మిలియన్ యూరోల (దాదాపు రూ.7,100 కోట్ల) విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేయగా, ఆస్ట్రేలియా 168 మిలియన్ యూరోలు (రూ.1,800 కోట్లు) , అమెరికా 154 మిలియన్ యూరోలు (రూ.1,647 కోట్లు) , న్యూజిలాండ్ 19 మిలియన్ యూరోల (రూ.203 కోట్ల) విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయి. 

జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్  దూకుడు

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ రిఫైనరీ ఈ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించింది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈయూ పోర్టులలో చేరిన 7 కార్గోలలో 6 కార్గోలు జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ నుంచే వెళ్లాయి. వీటిలో మూడు ఇటలీకి, రెండు రొమేనియాకు, మిగిలినవి స్పెయిన్, సైప్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చేరాయి. రోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కు వెళ్తున్న 1.04 లక్షల టన్నుల డీజిల్ కార్గో కూడా జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే. అమెరికాకు వెళ్లిన ఎగుమతుల్లోనూ జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ వాటానే (122 మిలియన్ యూరోలు) ఎక్కువ. జులై– సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ రిఫైనరీ దిగుమతుల్లో రష్యన్ చమురు వాటా 32 శాతంగా ఉండగా, మిగిలిన దేశాల వాటా 68 శాతంగా ఉంది.  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రష్యా క్రూడాయిల్ అయిన ఉరల్స్‌‌ దిగుమతులు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13శాతం తగ్గి 4.1 బిలియన్ యూరోలు ( రూ.43,900 కోట్లు) గా నమోదయ్యాయి. జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, ఐఓసీ పారాదీప్ దిగుమతులు తగ్గించగా, నయారా ఎనర్జీకి చెందిన వాడినార్ రిఫైనరీ అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచింది. అయినప్పటికీ చైనా తర్వాత రష్యా నుంచి అత్యధికంగా చమురు కొంటున్న రెండో పెద్ద దేశంగా భారత్  కొనసాగుతోంది.  

 120 డాలర్లకు చేరనున్న ఆయిల్ ధర! 

 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా-–ఇరాన్ చర్చలు ముందుకు సాగకపోవడంతో  క్రూడాయిల్ ధరలు చుక్కలనంటుతున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ దాదాపు 5 శాతం పెరిగి బ్యారెల్ ధర 109.86 డాలర్లకు  చేరింది. ఒక దశలో  110 డాలర్ల మార్కును తాకింది.  పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారితే  బ్రెంట్ క్రూడ్ 115 డాలర్ల నుంచి 120 డాలర్ల వరకు చేరే ప్రమాదముందని రెలిగేర్ బ్రోకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ అయితే గత వారం 9 శాతం పెరిగి 99.02 డాలర్ల వద్ద ముగిసింది. అదే  మనం చెల్లిస్తున్న ‘ఇండియా ఆయిల్ బాస్కెట్’ ధర ఏకంగా బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 121 డాలర్లకు చేరింది. అమెరికా ఆయిల్ నిల్వలు 80 లక్షల బ్యారెళ్లు తగ్గడం, ఎర్ర సముద్రంలో హూతీల దాడులు సరఫరాను దెబ్బతీస్తున్నాయి. అమెరికా షాడో ఫ్లీట్లపై  కొన్ని ఆంక్షలు సడలించినప్పటికీ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.