హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు. మంత్రి దామోదర వారం క్రితం కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఆదివారం మంత్రి సీతక్క కలిసి ఆరోగ్య పరిస్థితిని
అడిగి తెలుసుకున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
