హైదరాబాద్, వెలుగు: నేచురల్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ జూరి తన మొట్టమొదటి రిటైల్ ఔట్‌లెట్‌ను రాజ్‌భవన్ రోడ్డులో ప్రారంభించింది. ఫౌండర్లు సాయి వినీత్, మహేష్ చౌదరి, అంకుష్ సురానా దీనిని ప్రారంభించారు. రాబోయే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 25 స్టోర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యమని వారు తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే మూడు నెలల్లో నగరంలో మరో మూడు ఔట్‌లెట్లను తీసుకురానుండగా, దీపావళికి ముందే కొంపల్లిలో రెండో స్టోర్‌ను ప్రారంభిస్తామని వివరించారు. ఆఫీస్, పార్టీలు, రోజువారీ జీవనశైలికి నప్పేలా రూ.10 వేల నుంచి రూ.5 లక్షల ధరల శ్రేణిలో తేలికపాటి, సమకాలీన డిజైన్లను ‘ఎవ్రీడే లగ్జరీ’ పేరిట యువత కోసం తెచ్చినట్లు ఫౌండర్లు పేర్కొన్నారు.
