బడ్జెట్ యూజర్లకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్.. రూ.185, రూ.203, రూ.206తో కొత్త రీఛార్జ్ ప్లాన్లు

బడ్జెట్ యూజర్లకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్.. రూ.185, రూ.203, రూ.206తో కొత్త రీఛార్జ్ ప్లాన్లు

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ బడ్జెట్ యూజర్ల కోసం రూ.185, రూ.203, రూ.206 ధరలతో 3 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. తక్కువ ధర ప్లాన్లను యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో సులభంగా కనిపించేలా ఉంచాలని టెలికాం రెగ్యులేటరీ  ట్రాయ్  ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి. డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలపైనే ఆధారపడే వారి కోసం వీటిని తెచ్చారు.

ప్లాన్ల వివరాలు..

రూ. 185: అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకల్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీ, రోమింగ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 28 రోజుల వ్యాలిడిటీ.
రూ. 203: అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 30 రోజుల వ్యాలిడిటీ.
రూ. 206: అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఒక క్యాలెండర్ నెల పూర్తి వ్యాలిడిటీ.
ఈ మూడు ప్లాన్లలో ఉచిత 'హలోట్యూన్స్' సదుపాయం లభిస్తుంది. బేసిక్ ప్లాన్లను ఖరీదైన డేటా ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కలపొద్దని, వీటిని 'ట్రాయ్- మాండేటెడ్ ప్యాక్స్' పేరుతో మొదటి ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూపించాలని ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే.