- తాగునీటి కనెక్షన్ తొలగింపు
- ట్యాంకర్ల సరఫరా నిలిపివేత
- నీళ్లు వృథా చేసిన ఫలితం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫోర్ ఫాదర్స్ పబ్ కి జలమండలి ఆదివారం రూ.20 వేల జరిమాన విధించింది. తాగునీటితో ఫ్లోర్క్లీన్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
అలాగే, తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరా నిలిపివేశారు. సిటీలో ఎక్కడైనా నీటి దుర్వినియోగం జరిగితే ఫొటోలు, వీడియోలతో వాట్సాప్ నంబర్ 99499 30003కు లేదా కస్టమర్ కేర్ 155313కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
