బాట సింగారంలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

బాట సింగారంలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా బాటసింగారం సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్‌తో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బాటసింగారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.