అందుబాటులోకి మరో 500 ట్యాంకర్లు..బుకింగ్స్ పెరుగుతుండటంతో వాటర్ బోర్డు నిర్ణయం

అందుబాటులోకి మరో 500  ట్యాంకర్లు..బుకింగ్స్ పెరుగుతుండటంతో వాటర్ బోర్డు నిర్ణయం

హైదరాబాద్ సిటీ, వెలుగు: రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ముందస్తు ప్లాన్​తో పోతోంది. ఇప్పటికే రోజూ 7వేలకిపైగా ట్యాంకర్లు బుక్​అవుతుండడం, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ట్యాంకర్ల సంఖ్యని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,200 వాటర్‌‌ ట్యాంకర్లకు అదనంగా మరో 500 ట్యాంకర్లను తీసుకురానున్నది. 

దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌‌ జారీ చేసి, రిజిస్ట్రేషన్‌‌ రూల్స్​ఖరారు చేయాలని జలమండలి ఎండీ కె అశోక్‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆసక్తి ఉన్న ట్యాంకర్‌‌ యజమానులు రిజిస్ట్రేషన్‌‌  చేసుకోవాలని సూచించారు. ట్యాంకర్లకు డిమాండ్‌‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెండింగ్‌‌ బుకింగ్‌‌లను తగ్గించాలని, ముఖ్యంగా బోడుప్పల్‌‌ ప్రాంతంలో అదనంగా 50 ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.