- చెలరేగిన షెఫాలీ వర్మ, స్మృతి మంధాన
- మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం
రాయ్‌పూర్: జింబాబ్వేతో జరుగుతున్న టీ–20 సిరీస్‌ను ఇండియన్ ఉమెన్స్ టీమ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-–0 తేడాతో కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన రెండో టీ–20 మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వే నిర్దేశించిన103 రన్స్ లక్ష్యాన్ని భారత్ కేవలం 8.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే టీమ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారి ఇన్నింగ్స్‌లో ముగేరి తిరిపనో (34), జోసెఫైన్ (27 *) మాత్రమే పర్వాలేదనిపించగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇండియన్ బౌలర్లలో నిక్కీ ప్రసాద్ 2 వికెట్లతో రాణించగా.. క్రాంతి గౌడ్, నందనీ శర్మ, దీప్తి శర్మ, శ్రీచరణి తలో వికెట్ పడగొట్టారు.
షెఫాలీ, స్మృతి బౌండరీల మోత
ఛేజింగ్‌కు దిగిన ఇండియన్ టీమ్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన శుభారంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన షెఫాలీ వర్మ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (55 ) సాధించి బిజా బౌలింగ్‌లో ఔటయ్యింది. మరోవైపు స్మృతి మంధాన కూడా అంతే ధాటిగా ఆడుతూ 25 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. చివర్లో అనుష్క శర్మ (1*) తో కలిసి స్మృతి విజయ తీరాలకు చేర్చింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-–0 ఆధిక్యంలో నిలిచింది. నామమాత్రమైన మూడో టీ–20 మ్యాచ్ అక్టోబర్ 20న రాయ్‌పూర్‌లో జరగనుంది.
