జస్ట్ ఆధార్ ఉంటే చాలు.. 2 వేల రూపాయల లోన్.. ఇలా అప్లయ్ చేసుకుంటే చాలు..!

జస్ట్ ఆధార్ ఉంటే చాలు.. 2 వేల రూపాయల లోన్.. ఇలా అప్లయ్ చేసుకుంటే చాలు..!

డబ్బులు అత్యవసరం పడ్డాయా?  అంతా బాగుందనుకునే సమయంలో ఎక్స్ ట్రా ఖర్చులు వచ్చి పడ్డాయా? లేదా  ఇప్పుడున్న నగదుకు  ఇంకా డబ్బు కావాల్సి వచ్చిందా? లేదా  మీ జీతం ఇంకా రాకపోవడంతో డబ్బులు అవసరం పడ్డాయా.. చింతించకండి..  ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ. 2 వేలు వెంటనే  లోన్ గా తీసుకొచ్చు.. ఎలా అనుకుంటున్నారా.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో.. 

ఆధార్ కార్డుతో రూ. 2 వేల తక్షణ లోన్ పొందడం చాలా సులభం. RBI గుర్తింపు పొందిన యాప్‌లు లేదా బ్యాంకుల ద్వారా ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ ,పాన్ కార్డ్ ఉపయోగించి కేవలం 5-10 నిమిషాల్లోనే ఈ రుణం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.వయస్సు 18-60 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎలా అప్లయ్ చేయాలి..

కేవలం RBI చేత గుర్తింపు పొందిన బ్యాంకులు (NBFCs) లేదా పేటిఎం (Paytm), ఓలివ్ వంటి రిజిస్టర్డ్ అధికారిక యాప్‌ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.ఆధార్ కార్డు, పాన్ కార్డు ,బ్యాంక్ వివరాలను అప్‌లోడ్ చేయాలి. ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తవుతుంది.