హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నవంబర్ 27 నుంచి ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు సహా పలు విభాగాల్లో 80 శాతం వరకు తగ్గింపులు అందిస్తోంది. శాంసంగ్, వన్‌ప్లస్, జేబీఎల్, ఎల్‌జీ, బోట్, ఫిలిప్స్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు ప్రకటించింది. నో కాస్ట్ ఈఎంఐ, కూపన్ తగ్గింపులు, పాత ఉత్పత్తుల మార్పిడిపై ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
