హైదరాబాద్, వెలుగు: ‘భారత రాజ్యాంగం – ఓటు హక్కు – ఎన్నికల సంస్కరణలు’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జాతీయ సదస్సు జరగనుంది. రాజ్యాంగ పరిరక్షణ వేదిక (ఆర్పీవీ) తెలంగాణ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం సెషన్లో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ ఆర్. హెగ్డే , సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ కీలకోపన్యాసం చేయనున్నారు.
లంచ్ తర్వాత ఇంటరాక్షన్ సెషన్ లో పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, సీపీఐ ఎంఎల్ నేతలు ప్రభాకర్, గోవర్ధన్, హెచ్సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ పాల్గొంటారు.
