హైదరాబాద్, వెలుగు: బడి స్థాయి నుంచే వ్యాపార నిర్వహణ, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈథేమ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన టీన్ సీఈఓ ఛాలెంజ్ విజేతలను ప్రకటించారు. పోటీల రెండో ఎడిషన్‌లో 54 పాఠశాలలకు చెందిన 9,649 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 423 మందికి పైగా విద్యార్థులు తుది పోటీలకు అర్హత సాధించారు.
ఈథేమ్స్ క్యాంపస్‌లో శనివారం ఫైనల్స్ నిర్వహించారు. పరిశ్రమల నిపుణులతో కూడిన జ్యూరీ విద్యార్థుల వ్యాపార ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను అంచనా వేసి విజేతలను ఎంపిక చేసింది.
