కూకట్పల్లి, వెలుగు: ప్రమాదవశాత్తు కార్తీక దీపం చీరకు అంటుకుని మంటలు చెలరేగి గాయాలకు గురైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేపీహెచ్బీ పీఎస్పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డగుట్ట సొసైటీ వెస్ట్రన్హిల్స్లో సాయివెంకట సింధు(18) తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. ఇదే కాలనీలో ఎస్ఎస్పేరుతో బొటిక్ నిర్వహిస్తుంది.
ఈనెల12న సింధు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లే ముందు గేటు వద్ద వెలిగించిన కార్తీకదీపం చీరకు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం సింధు మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
