లక్నో: ఇండియా డబుల్ షట్లర్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన పోలినా బుహ్రోవా, యెవ్హేనియా కాంటెమిర్ జోడీపై 13–--21, 21–--10, 21–--12 తేడాతో విజయం సాధించారు.
ఫైనల్‌లో ఇండోనేషియాకు చెందిన ఇస్యానా స్యాహిరా మెయిడా, రింజని క్వినారా నాస్టిన్ జంటతో త్రిసా, గాయత్రీ పోటీపడనున్నారు. సయ్యద్ మోదీ టోర్నీలో ఈ జోడీ వరుసగా మూడోసారి టైటిల్ గెలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఇండియన్ ప్లేయర్ తన్వీ శర్మ కూడా ఫైనల్ కు చేరుకుంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తన్వి 11-–21, 21-–10, 21–-13 స్కోరుతో ఉన్నతి హూడాపై విజయం సాధించింది.
తన్వీ ఫైనల్లో థాయిలాండ్‌కు చెందిన సుపానిద కేటథాంగ్‌ను ఢీకొట్టనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి కానపురం, రేషిక ఉదయసూరియన్ జంట సెమీఫైనల్‌లో ఓడిపోయారు. మలేషియాకు చెందిన వీ యీ హెర్న్, వన్నీ గోబి చేతిలో 17–21, 18–21 స్కోరుతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో రిచీ దత్తా రిచార్డో, ఫ్రాన్స్‌కు చెందిన ఆర్నాడ్ మెర్క్లే తలపడనున్నారు.
