మయన్మార్: ఓ పెళ్లి ఇంటిపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. షాన్, కరెన్ని రాష్ట్రాల సరిహద్దుల్లోని మో బే ప్రాంతంలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. నిరాశ్రయులైన ఇద్దరు వ్యక్తుల వివాహానికి ఏర్పాట్లు చేస్తున్న ఓ ఇంటిపై బాంబు పడినట్లు ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారు.
విమానం శబ్దం వినిపించినా తమ ప్రాంతంపై దాడి జరగదని భావించామని, ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే పేలుడు శబ్దం వినిపించిందని, దీంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుందని తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టానని, అక్కడ 17 మృతదేహాలను చూశానని చెప్పారు. మృతుల్లో ఓ మహిళ, చిన్నారి కూడా ఉన్నట్లు ఇతర గ్రామస్తులు తీసిన
ఫొటోలతో వెల్లడైంది.
