హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన ఆడియో, సంగీత పరికరాల పంపిణీ సంస్థ డెక్కన్ సౌండ్‌స్కేప్ దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం రూ.120 కోట్ల వార్షిక టర్నోవర్‌తో కొనసాగుతున్న సంస్థ వచ్చే 2–3 ఏళ్లలో ఐపీఓకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సొంత బ్రాండ్లను పరిచయం చేయనుంది. నగరంలో రూ.25 కోట్ల పెట్టుబడితో నిర్మించిన హెడాఫీసును సంస్థ ఎండీ జైన్ ప్రారంభించారు. త్వరలో ఇక్కడే ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
యమహా, ష్యూర్, సెన్‌హైజర్, మార్షల్ వంటి 30కి పైగా అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్ల ఉత్పత్తులను సంస్థ పంపిణీ చేస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 60 మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.1,000 హెడ్‌ఫోన్ల నుంచి రూ.5–10 కోట్ల విలువైన భారీ ఆడియో ప్రాజెక్టుల వరకు విస్తరించిన ఉత్పత్తుల శ్రేణి తమ వ్యాపారానికి బలమని సంస్థ తెలిపింది.
