ముంబై: భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ కీలకంగా మారింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అభివృద్ధి దశలోని ప్రాజెక్టుల సంఖ్యలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నాటికి నగరంలో 15 డేటా సెంటర్ ప్రాజెక్టులు నిర్మాణ ప్రణాళికలో ఉన్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. 2025లో ఈ సంఖ్య 11గా ఉంది. నగరంలో నిర్మాణంలో ఉన్న 15 ప్రాజెక్టుల్లో 14 కేంద్రాలు 50 మెగావాట్లకు పైగా సామర్థ్యం కలిగినవే.
వీటిలో 8 కేంద్రాలు 100 మెగావాట్లకు పైగా సామర్థ్యంతో రానున్నాయి. మరో 6 కేంద్రాలు 50–100 మెగావాట్ల సామర్థ్య విభాగంలో ఉన్నాయి. దీంతో మొత్తం ప్రాజెక్టుల్లో 93.3 శాతం భారీ డేటా సెంటర్లే కావడం
