హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజ్యసభలో తమకున్న ముగ్గురు ఎంపీలు బిల్లుకు మద్దతుగా ఓటేస్తారని చెప్పారు. శనివారం ఆయన ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. డీలిమిటేషన్‌పై తమ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎటువంటి తగ్గుదల ఉండకూడదన్నారు. తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్నీ సహించేది లేదని పేర్కొన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత 24 శాతం వాటాను కాపాడాలని నిరంతరం డిమాండ్చేస్తూనే ఉన్నామని చెప్పారు. 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా రక్షణ కల్పిస్తూ, సీట్లను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనతో తమ ఆందోళన తగ్గిందని, ఆ ప్రతిపాదనతో తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు.
డ్రామా ఆపండి: కేటీఆర్ ధ్రువ్ రాఠీ కౌంటర్
కేటీఆర్‌పై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ‘ఎక్స్’ లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ అంశంపై కేటీఆర్ చేసిన పోస్టుకు కౌంటర్ ఇస్తూ.. ‘‘సౌత్ వర్సెస్ నార్త్ డ్రామాను ఆపండి’’ అని చురకలంటించారు.శనివారం కేటీఆర్చేసిన ట్వీట్‌కు ఆయన స్పందిస్తూ.. ‘‘ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు నియోజకవర్గాలను పునర్విభజించాలన్న బీజేపీ ఎజెండాకు మీరు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. భారత ప్రజాస్వామ్య హత్యకు మీరు సహకరిస్తున్నారు’’ అని ఘాటుగా విమర్శించారు.
