ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా హెచ్ఆర్ రంగం ఎదగాలి

ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా హెచ్ఆర్ రంగం ఎదగాలి

హైదరాబాద్​, వెలుగు: మారుతున్న సాంకేతికత, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా హెచ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగం తన పాత్రను విస్తరించుకోవాలని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐపీఎం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిక్కాల వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు. సంప్రదాయ పద్ధతుల్లో ఉద్యోగుల నిర్వహణకే పరిమితం కాకుండా, సంస్థల వ్యాపార వ్యూహాల్లో కీలక భాగస్వామిగా మారాలని సూచించారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ‘ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐపీఎం సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో ఆయన మాట్లాడారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సంస్థల నిర్మాణానికి హెచ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిపుణుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ‘భవిష్యత్తు సంస్థలను నేడే నిర్మించడం: వూకా ప్రపంచంలో హెచ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకత్వం’ పేరుతో జరిగిన ఈ సదస్సుకు 235 మంది హాజరయ్యారు.