హైదరాబాద్లో బొనిటో డిజైన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షురూ

హైదరాబాద్లో బొనిటో డిజైన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షురూ

హైదరాబాద్, వెలుగు: హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటీరియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలో ఉన్న బొనిటో డిజైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన కార్యకలాపాలను విస్తరించింది. గచ్చిబౌలిలో 14 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో కొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ప్రారంభించింది. ముంబై, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ఇళ్లకు అనుగుణమైన డిజైన్లు, ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటీరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవలను పొందవచ్చు. 

గత 2 ఏళ్లుగా ఏటా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నామని, ప్రస్తుతం వార్షిక ఆదాయ రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.450 కోట్లను దాటిందని వెల్లడించింది.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొత్త కేంద్రం ద్వారా ఏడాదికి రూ.180 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ శ్వేతాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.