ప్రీ-ఐపీఓ షేర్ల కోసం ప్రత్యేక ట్రేడింగ్ ఎక్స్చేంజ్.. గ్రే మార్కెట్ మోసాలకు చెక్!

ప్రీ-ఐపీఓ షేర్ల కోసం ప్రత్యేక ట్రేడింగ్ ఎక్స్చేంజ్.. గ్రే మార్కెట్ మోసాలకు చెక్!

   
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే (ప్రీఐపీఓ) కంపెనీల షేర్లను అధికారికంగా కొనుగోలు చేసి, అమ్ముకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ  యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోందని, త్వరలోనే ప్రజల అభిప్రాయాల కోసం 'కన్సల్టేషన్ పేపర్' విడుదల చేస్తామని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. 

దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న అన్ని అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్టెడ్  కంపెనీలకు కాకుండా కేవలం త్వరలో ఐపీఓకు రాబోతున్న కంపెనీల షేర్లకు మాత్రమే ఈ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతి ఉంటుందని పాండే స్పష్టం చేశారు. ఇటీవల గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) పేరుతో సాగుతున్న అనధికారిక లావాదేవీలపై సెబీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల రక్షణ కోసం ఈ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురానున్నారు.