Chatha Pacha OTT Release: వారానికే ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ.. నవ్వులు పూయించే 'చథా పచ్చ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Chatha Pacha OTT Release: వారానికే ఓటీటీలోకి  మలయాళ హిట్ మూవీ..  నవ్వులు పూయించే 'చథా పచ్చ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళీ మూవీస్ అంటేనే వైవిధ్యమైన కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి.  ఇటీవల చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘చథా పచ్చ’ ఒకటి. అద్వైత్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, మలయాళ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. సుమారు రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ వినోదాత్మక చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో సందడి చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. 

 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫిబ్రవరి 19 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ నిన్ననే అంటే ఫిబ్రవరి 13న  థియేటర్లలో విడుదలైంది. కానీ, రెండు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ప్రమోషన్లు కూడా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దీనికి ఊహించని స్పందన ఎదురైంది. ఎంతలా అంటే మినిమం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడం షోలు రద్దు చేయాల్సి వచ్చింది.  ఇది డిస్టిబ్యూటర్స్ కు , చిత్ర యూనిట్ కు షాక్ షాకిచ్చినట్లైంది.  థియేటర్లోకి వచ్చిన వారం తిరక్కుండానే ఓటీటీలోకి వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కథా నేపథ్యం..

ఈ సినిమా కథ మొత్తం ముగ్గురు అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుంది. మారుమూల గ్రామంలో ఉండే ఈ సోదరులకు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) అంటే ప్రాణం. ఆ పిచ్చితోనే వారు ఎవరికీ తెలియకుండా ఒక 'అండర్‌గ్రౌండ్ రెజ్లింగ్ క్లబ్ ను ప్రారంభిస్తారు. అమెచ్యూర్ స్థాయిలో వీరు చేసే కుస్తీ విన్యాసాలు, వాటి వల్ల తలెత్తే కామెడీ, ఆ తర్వాత వచ్చే ఊహించని మలుపులు, భావోద్వేగాల సమాహారమే ఈ సినిమా.

తారాగణం

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ కామెడీలో  అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వారి నటన సినిమాకు ప్రాణం పోసింది. సిద్ధిఖీ, లక్ష్మీ మీనన్, ఇషాన్ శౌకత్ కీలక పాత్రల్లో మెరిశారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ పోషించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచింది.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత ద్వయం శంకర్-ఎహసాన్-లాయ్ , ముజీబ్ మజీద్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలను అందించారు. రీల్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్స్,యాక్షన్ కొరియోగ్రఫీ మలయాళ నేటివిటీకి తగ్గట్టుగా ఉంటూనే, గ్లోబల్ అప్పీల్‌ను కలిగి ఉన్నాయి. మళయాళంలో హిట్ కొట్టి.. తెలుగులో నిరసించిన ఈ మూవీ ఓటీటీలో ఏ మేరకు సినీ ప్రియులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.