ఇషాన్ కిషన్ విధ్వంసం.. 6.5 ఓవర్లలోనే 100 రన్స్ చేసిన టీమిండియా.. 12 ఏళ్ల పాత రికార్డు బద్ధలు

ఇషాన్ కిషన్ విధ్వంసం.. 6.5 ఓవర్లలోనే 100 రన్స్ చేసిన టీమిండియా.. 12 ఏళ్ల పాత రికార్డు బద్ధలు

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఏలో భారత్ తన రెండో మ్యాచ్‌ను నమీబియాతో ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్తో టీమిండియా ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ కేవలం 6.5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. దీంతో.. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ పేరు మీద ఉండేది. 2014లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కేవలం 7 ఓవర్లలో 100 రన్స్ చేయగా.. ఇప్పుడు భారత్ ఆ రికార్డును అధిగమించేసింది.

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్తో.. కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ 6 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు, తిలక్ వర్మతో కలిసి సెకండ్ వికెట్‌కు జస్ట్ 31 బంతుల్లోనే 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు.

ప్రస్తుతం ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఫస్ట్ ఛాయిస్ వికెట్‌ కీపర్ -బ్యాటర్‌గా ఉన్న ఇషాన్ కిషన్.. బ్యాటింగ్లో తన అద్బుతమైన ఫామ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసి నమీబియాకు భారీ టార్గెట్ నిర్దేశించింది. నమీబియా జట్టు ఈ టార్గెట్ను ఛేజ్ చేసే క్రమంలో.. 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్తో క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు. హార్డ్ హిట్టింగ్ షాట్స్తో పాటు రికార్డులను ఈ ఒకే మ్యాచ్‌తో టీమిండియా తిరగరాసింది.