కారుతో ఢీకొట్టి, గొంతు కోసి.. అడ్వకేట్ స్వప్న హత్య కేసులో వీడిన మిస్టరీ: సొంత అన్నే నిందితుడు!

కారుతో ఢీకొట్టి, గొంతు కోసి.. అడ్వకేట్ స్వప్న హత్య కేసులో వీడిన మిస్టరీ: సొంత  అన్నే నిందితుడు!

హైదరాబాద్: న్యాయవాది గోటికె స్వప్న హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు నిర్దారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మృతురాలి సొంత అన్న గోటికె రాజుతో అతడికి సహకరించిన మరో ముగ్గురు సహచరులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేవెళ్ళ జోన్  డీసీపీ యోగేశ్ గౌతమ్ వివరాలు మీడియాకు వెళ్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని కేతిరెడ్డిపల్లిలో ఈ నెల 4న మహిళా న్యాయవాదిని పథకం ప్రకారం హత్య చేశారు. సర్వే నంబర్ 339లోని 4 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా భూమి సర్వే కోసం వెళ్లిన సమయంలో కారుతో ఢీకొట్టి తర్వాత రాళ్లు కర్రలతో దాడి చేశారు. దాడి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేసి ఇన్నోవా కారు, స్కూటీలో పారిపోయారు. ఇన్నోవా కారు, స్కూటీ సీజ్ చేసిన పోలీసులు నిందితుల మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కొడవలి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజుతో పాటు హత్యతో సంబంధం ఉన్న ఎర్రోళ్ల సందీప్, వడ్డె వీరేశం, కావలి శివలింగంలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

న్యాయవాదుల ధర్నా

మహిళా యువ న్యాయవాది హత్య పై ఫిర్యాదు చేయడానికి వస్తే తీసుకోకుండా బైటికి వెళ్లాలని బెదిరించినట్లు ఆరోపిస్తూ న్యాయవాదుల ధర్నా చేశారు. కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. మొయినాబాద్ ఎస్ ఐ నరసింహారావు ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.