160 కిలోమీటర్ల స్పీడా.. అది కారునా.. విమానమా.. గుద్దితే పీస్ పీస్.. ఆరుగురు స్టూడెంట్స్ స్పాట్ లోనే

160 కిలోమీటర్ల స్పీడా.. అది కారునా.. విమానమా.. గుద్దితే పీస్ పీస్.. ఆరుగురు స్టూడెంట్స్  స్పాట్ లోనే

ఈ కాలం కుర్రోళ్లకు కన్నూమిన్నా ఆడటం లేదు.. చేతిలో కారు.. స్టీరింగ్ పై చేతులు ఉంటే చాలు.. చుట్టుపక్కల ఏమీ కనిపించటం లేదు.. బెంగళూరు సిటీ శివార్లలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ భయంకరమైన నిజాలను బయటపెట్టింది. యాక్సిడెంట్ టైంలో కారు స్పీడ్ ఎంతో తెలుసా.. అక్షరాల 160.. అవును 160 కిలోమీటర్ల వేగంతో ఆ కారు ఢీకొట్టింది.. పోలీసులు సైతం షాక్ అయ్యారు.. అది కారునా లేక విమానమా అన్నట్లు అవాక్కయ్యారు. ఆ యాక్సిడెంట్ లో ఆ SUV కారు పీస్ పీస్ అయ్యింది.. కారులోని ఆరుగురు స్టూడెంట్స్ స్పాట్ లో చనిపోయారు.. వారి శరీరభాగాలు విరిగిపోయాయి.. అత్యంత దారుణమైన ఈ కారు యాక్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

అది బెంగళూరు హోస్కోట్ కంబాలిపురా ప్రాంతం.. బైకును SUV కారు  అతివేగంతో బైకును వెనకనుంచి ఢీకొట్టింది. క్షణాల్లో విధ్వంసం సృష్టించింది. తుక్కు తుక్కయిన కారు. అసలు ఆ కారు పొషిషన్ చూస్తే అర్థమవుతుంది ఏ రేంజ్ లో కారువేగంగా నడిపారో తెలిసిపోతుంది. శుక్రవారం తెల్లవారు జామున  4.15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

కారులో ఉన్న  విద్యార్థులు షరీఫ్(16), అశ్విన్ నాయర్, ఈతన్ జార్జ్,  అయాన్ అలీ,  భరత్(17), మహ్మద్ ఫర్హాన్ షేర్ (18) లు కారులో ఇరుక్కొని గుర్తు పట్టలేనంతగా నుజ్జు నుజ్జు అయి చనిపోయారు. 

కారు గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జయింది. విద్యార్థులు కారులో ఇరుక్కొని ప్రాణాలు వదిలారు. మృతులంతా పద్దెనిమిదేళ్ల లోపు వారే. కారు బైకును మరో ట్రక్కును కూడా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కు కూడా రెండు ముక్కలయిందంటే కారు ఎంత స్పీడ్ లో ఉందో తెలుస్తోంది. కారు స్పీడ్ కు భారీ వాహనం ప్రధాన క్యారేజ్‌వే నుంచి సర్వీస్ రోడ్డుపైకి వెళ్లి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. 

ట్రక్కును ఢీకొట్టిన తర్వాత, ఎస్‌యూవీ క్రాష్ బారియర్‌ను ఢీకొట్టి దాదాపు 150 మీటర్ల దూరం దూసుకెళ్లి ఆగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. 

మృతులు  కొత్తనూర్, చెన్నరాయపట్నానికి చెందినవారు గుర్తించారు పోలీసులు. కొత్తనూర్ నివాసి అశ్విన్, హులిమావుకు చెందిన ఈతన్, ఆర్‌వి పియు కళాశాల విద్యార్థులు. హెచ్‌వి ఆర్ లేఅవుట్ నివాసి అహ్రామ్, కొత్తనూర్‌కు చెందిన అయాన్ సిఎంఆర్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి.  ఫ్రేజర్ టౌన్ నివాసి భరత్ శోభన మెమోరియల్ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థి కాగా, కమ్మనహళ్లికి చెందిన మహ్మద్ కరస్పాండెన్స్ కోర్సు ద్వారా 10వ తరగతి చదువుతున్నాడు. చెన్నరాయపట్నం దేవనాయకనహళ్లి నివాసి గగన్ గిడ్డంగి సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.