గోల్డ్ రేట్స్ మరోసారి షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మూడు రోజులునుంచి కాస్త తగ్గుముఖం పట్టినా..ఇవాళ మరోసారి పెరిగాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1970 రూ. 1లక్షా 44వేల 600 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగార ధర 1లక్షా 57వేల850 కు చేరుకుంది.
ఇ కప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1లక్షా 55వేల780 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై ఇవాళ రూ.1,970 పెరిగి రూ. 1,57,750లకు చేరింది. అలాగే నిన్న రూ.1లక్షా42వేల800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై ఇవాళ రూ.1,970 పెరిగి రూ.1లక్షా 44వేల600 గా ఉంది. పెట్టుబడిదారులు ఆభరణాల డిమాండ్ ,పెట్టుబడి నిర్ణయాలతో బంగారం ధరలపై ప్రభావం చూపిందని ఎల్లో మెటల్ ఎనలిస్టులు చెబుతున్నారు.
ఇక వెండి ధరలు వినియోగదారులకు స్పల్ప ఊరట కలిగించాయి. జాతీయ బెంచ్‌మార్క్‌లు స్వల్ప తగ్గుదలను చూపడంతో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.శనివారం కిలో రూ. 2లక్షల80వేలుగా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.
