కొత్తగూడెం మేయర్ పీఠంపై వీడిన ఉత్కంఠ.. కాంగ్రెస్ సపోర్ట్తో కొత్తగూడెం కార్పొరేషన్‌‌‌‌పై ఎర్రజెండా

కొత్తగూడెం మేయర్ పీఠంపై వీడిన ఉత్కంఠ.. కాంగ్రెస్ సపోర్ట్తో కొత్తగూడెం కార్పొరేషన్‌‌‌‌పై ఎర్రజెండా

హైదరాబాద్: సీఎం, పీసీసీ, సీపీఐ నేతల చర్చలు సఫలం కావడంతో కొత్తగూడెం మేయర్ పీఠంపై ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్- సీపీఐ పొత్తుతో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని ఇరు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. మేయర్ పదవి సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో.. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు ఖరారైంది.

7 కార్పొరేషన్లలో కాంగ్రెస్​ 4 స్థానాల్లో ఒంటరిగానే మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. నల్గొండ, రామగుండం, మంచిర్యాల, మహబూబ్​నగర్​ కార్పొరేషన్లలో జెండా ఎగురవేసింది. నల్గొండలో మొత్తం 48 సీట్లకు 27 చోట్ల, రామగుండంలో 60 సీట్లకు 38, మంచిర్యాలలో 60 సీట్లకు 44 స్థానాల్లో గెలుపొందింది. మహబూబ్​ నగర్​లో కూడా ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది.

కాంగ్రెస్​ పార్టీ సహకారంతో కొత్తగూడెం కార్పొరేషన్‌‌‌‌పై ఎర్రజెండా ఎగురనున్నది. ఇక్కడ 60 సీట్లకు కాంగ్రెస్​, సీపీఐకి చెరో 22 సీట్లు వచ్చాయి. ముందుగా బీఆర్ఎస్తో సీపీఐ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయింది. కానీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చాయి.

రెండు పార్టీలకు కలిపి మెజారిటీ రాకపోవడంతో సీఎం రేవంత్​ స్వయంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుకు ఫోన్​ చేసి మాట్లాడారు. తాము మద్దతిస్తామని చెప్పడంతో సీపీఐ ఊపిరి పీల్చుకున్నది. పోలింగ్‌‌‌‌కు ముందు మొదట ఎవరికివారుగా పనిచేసినా చివరికి కలవడంతో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లయింది. ఈ పరిణామంతో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.