వాస్తవాలను నిర్భయంగా ప్రజలకందించాలి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై సెమినార్

వాస్తవాలను నిర్భయంగా ప్రజలకందించాలి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై సెమినార్
  • ప్రెస్​ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సూచన

భద్రాచలం, వెలుగు : వాస్తవాలను నిష్పాక్షికంగా, నిర్భయంగా ప్రజలకు అందించాలని ప్రెస్​అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి సూచించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలో నిర్వహించిన ' సమాజంపై సోషల్ ​మీడియా ప్రభావం' అనే సెమినార్​లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో సోషల్​మీడియా సమాజంపై చూపుతున్న ప్రభావం, సమాచార ప్రసారంలో వేగం, తప్పుడు ప్రచారం, సోషల్ మీడియా సానుకూల, ప్రతికూల ప్రభావాలు, ఫేక్​న్యూస్​ను గుర్తించే విధానం, డిజిటల్​మీడియా భవిష్యత్ వంటి పలు అంశాలపై వివరించారు. కార్యక్రమంలో భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ పాల్గొన్నారు. అనంతరం సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులకు హాజరై... సీపీఐ ఎదుర్కొంటున్న సవాళ్లు, అధిగమించే మార్గాలను వివరించారు.