ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ రాజుకోవటం బులియన్ మార్కెట్లలో కూడా స్వల్ప ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఈవారం బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా తమ ప్రాంతంలో మారిన ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.
జూలై 8న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 7 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.77 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 449గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 245గా కొనసాగుతోంది.
ALSO READ : టాటా పవర్ లక్ష్యం.. 2030 నాటికి రూ. లక్ష కోట్ల ఆదాయం
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 8, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
