హైదరాబాద్, వెలుగు: తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ స్థాపించిన కార్వ్ ఎఫ్‌జెడ్ -ఎల్‌ఎల్‌సీకి నాలుగు మిలియన్ డాలర్ల (దాదాపు రూ.38 కోట్లు) అంతర్జాతీయ పెట్టుబడి కమిట్‌మెంట్ లభించింది. దుబాయ్‌లో నిర్వహించిన ఐసీఐఈ డీల్ రూమ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాస్ అల్ ఖైమా ఎకనామిక్ జోన్ (రాకెజ్)లో ఏర్పాటైన కార్వ్ సంస్థ హెల్త్‌టెక్ రంగం కోసం వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది. గత రెండేళ్లుగా తన వ్యాపార ఆలోచనను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఐసీఏఐ చైర్మన్సందీప్ మక్తల మార్గదర్శకత్వం తోడ్పడిందని రఘునాథ్చెప్పారు. సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సంస్థలను, పెట్టుబడిదారులతో భేటీ అయ్యాయని. నెల రోజుల్లోనే నాలుగు మిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించానని తెలిపారు.
