నేనడిగొండ (ఇచ్చోడ), వెలుగు: అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దుబార్పేట్కు చెందిన కాత్లె ఆనంద్ రావు అరుదైన అవకాశం దక్కించుకున్నారు. నేపాల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు దేశం మొత్తం మీద కేవలం ఐదుగురిని ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి ఆనంద్ రావుకు చోటు దక్కింది. జూలై 27 నుంచి ఆగస్టు 20 వరకు నేపాల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నిర్వహించనున్నారు.
అయితే, తనది నిరుపేద కుటుంబమని.. ప్రయాణ ఖర్చులు, అడ్మిషన్ ఫీజు కోసం సుమారు రూ. 2.50 లక్షల వరకు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని భరించే స్తోమత తన కుటుంబానికి లేదని ఆనంద్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తనకు ఆర్థికంగా సాయమందించి, తన కలను నిజం చేయాలని ఆయన వేడుకుంటున్నారు.
