ఫిఫా నుంచి అమెరికా ఔట్.. ట్రంప్ డ్యాన్స్‌తో లుకాకు సెలబ్రేషన్.. వీడియో వైరల్!

ఫిఫా నుంచి అమెరికా ఔట్.. ట్రంప్ డ్యాన్స్‌తో లుకాకు సెలబ్రేషన్.. వీడియో వైరల్!

USA vs Belgium: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) నాకౌట్ స్టేజ్‌లో ఊహించని హై-డ్రామాకు తెరలేపిన అమెరికా స్టార్ స్ట్రైకర్ ఫోలారిన్ బాలోగన్ (Folarin Balogun) రెడ్ కార్డ్ వివాదం ఆఖరికి యూఎస్ఏ కొంపముంచింది. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫిఫా బాస్‌కు ఫోన్ చేసి, తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బాలోగన్ మీద ఉన్న వన్-మ్యాచ్ బ్యాన్‌ను ఎత్తేయించినా ఫలితం లేకుండా పోయింది. నిన్న (సోమవారం) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో బెల్జియం జట్టు 4–1 తేడాతో అమెరికాను ఘోరంగా ఓడించింది. ట్రంప్ చేసిన ఫిఫా ఇంటర్వెన్షన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో సోషల్ మీడియాలో ట్రంప్ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్‌ను వెక్కిరిస్తూ.. లుకాకు డ్యాన్స్: 
ఈ మ్యాచ్‌లో బెల్జియం గెలిచిన తర్వాత ఆ జట్టు స్టార్ స్ట్రైకర్ రోమేలు లుకాకు (Romelu Lukaku) చేసిన పని ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడి జోక్యాన్ని, వారి ఓటమిని ఎగతాళి చేస్తూ.. లుకాకు మైదానంలోనే డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్‌మార్క్ డ్యాన్స్ స్టెప్పులను వేసి వెక్కిరించాడు. పుండుపై కారం చల్లినట్లున్న లుకాకు డ్యాన్స్ వీడియోలు ఫుట్‌బాల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  

ఆ వార్త వినగానే మీటింగ్ పెట్టాం: 
మ్యాచ్ ముగిసిన అనంతరం బెల్జియం మిడ్‌ఫీల్డర్ యూరి టిలేమన్స్ (Youri Tielemans) మాట్లాడుతూ.. బాలోగన్ రెడ్ కార్డ్‌ను ఫిఫా రద్దు చేసిందనే వార్త తమలో కసిని పెంచిందని ఓపెన్‌గా చెప్పేశాడు. నిజం చెప్పాలంటే.. బాలోగన్‌ను ఆడనిస్తున్నారనే న్యూస్ వినగానే మేమంతా ఒక మీటింగ్ పెట్టుకున్నాం.. మా సమాధానం ఏదైనా మైదానంలో ఆటతోనే చూపించాలని డిసైడ్ అయ్యాం.. ఈరోజు అదే చేసి చూపించాం.. మా జట్టును చూస్తే గర్వంగా ఉందన్నాడు. అంతేకాదు, మేము ఈ మ్యాచ్‌లో పక్కా ప్లానింగ్‌తో ఆడాం.. మ్యాచ్ స్టార్టింగ్‌లోనే అమెరికాపై ఒత్తిడి పెంచితే వాళ్లు తప్పులు చేస్తారని మాకు తెలుసు, అదే జరిగిందని టిలేమన్స్ పేర్కొన్నాడు.

►ALSO READ | మెస్సీ మ్యాజిక్‌కు టైమ్ అయింది.. అర్జెంటీనా vs ఈజిప్ట్ బ్లాక్‌బస్టర్ పోరు.. భారత్‌లో ఇక్కడ చూడండి!  

బాలోగన్ అట్టర్ ప్లాప్: 
ఫిఫా రూల్స్ మార్చి (ఆర్టికల్ 27 ప్రకారం వన్-ఇయర్ ప్రొబేషన్ ఇచ్చి) బాలోగన్‌ను తుది జట్టులోకి తెచ్చినప్పటికీ.. బెల్జియం డిఫెన్స్ ముందు అతడు చేతులెత్తేసాడు. మ్యాచ్ మొత్తం కనీసం ఒక్క ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయాడు. అమెరికా టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా డొనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ మీమ్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఫిఫాలో రాజకీయాలు నడిపినా ఆటను మార్చలేరు అంటూ బెల్జియం ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.