Argentina vs Egypt: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) నాకౌట్ స్టేజ్ మ్యాచులు ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈరోజు (మంగళవారం) ఉదయం జరిగిన మ్యాచ్‌ల్లో పోర్చుగల్‌పై స్పెయిన్ 1–0తో గెలవగా.. అమెరికాపై బెల్జియం 4–1తో గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇక ఈ రాత్రి జరగబోయే మిగతా రెండు మ్యాచ్‌లపై అందరి కళ్లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా.. ఆఫ్రికన్ కింగ్స్ ఈజిప్ట్‌తో తలపడనుండగా.. మరో మ్యాచ్‌లో కొలంబియా, స్విట్జర్లాండ్ జట్లు ఢీకొనబోతున్నాయి. అయితే భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ల టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్, పూర్తి వివరాలు ఇవే..
* అర్జెంటీనా vs ఈజిప్ట్:
ఈ రాత్రికి జరగబోయే మోస్ట్ అవేటెడ్ మ్యాచ్ ఇదే! అట్లాంటా స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ మ్యాచ్ జరగబోతుంది. గ్రూప్ స్టేజ్‌లో దుమ్మురేపి నాకౌట్‌కు వచ్చిన అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అర్జెంటీనా తరఫున లియోనల్ మెస్సీ మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కానున్నాడు. అతనికి తోడుగా అలెక్సిస్ మాక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్ మిడ్‌ఫీల్డ్‌లో కీలకం కానున్నారు. మరోవైపు, ఈజిప్ట్ కేవలం ఒకే ఒక్కడిపై ఆశలు పెట్టుకుంది.. అతడే ఈజిప్షియన్ కింగ్ మహ్మద్ సలాహ్. సలాహ్ స్పీడ్, ఎక్స్‌పీరియన్స్‌తో అర్జెంటీనా డిఫెన్స్‌ను దెబ్బకొట్టాలని ఆ జట్టు చూస్తోంది. మార్వాన్ అట్టేయా, హమ్దీ ఫాతి మిడ్‌ఫీల్డ్‌ను కంట్రోల్ చేయనున్నారు. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 9:30 గంటలకి ప్రారంభం కానుంది.
* స్విట్జర్లాండ్ vs కొలంబియా:
వాంకోవర్‌లోని బీసీ ప్లేస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో ఒక్క ఫస్ట్ హాఫ్ గోల్ కూడా కాన్సీడ్ చేయకుండా, అల్జీరియాను 2–0తో ఓడించి స్విస్ టీమ్ ఫుల్ ఫామ్‌లో ఉంది. గ్రానిట్ జాకా లీడర్‌షిప్‌లో స్విట్జర్లాండ్ డిఫెన్స్ చాలా బలంగా ఉంది. ఇంకోవైపు ఘనాను 1–0తో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు వచ్చిన కొలంబియా జట్టుకు స్ట్రైకర్ జాన్ కార్డోబా ఇంజూరీ పెద్ద మైనస్.. అయినప్పటికీ బేయర్న్ మునిచ్ స్టార్ లూయిస్ డియాజ్ వింగ్స్ నుంచి ప్రత్యర్థి జట్టుని ఎదుర్కొనడానికి రెడీగా ఉంది. (బుధవారం రాత్రి 1:30 గంటలకి ఈ మ్యాచ్ చూడొచ్చు)
ALSO READ : బాలోగన్ రెడ్ కార్డుపై ట్రంప్ ఫోన్?.. అమెరికా ప్లేయర్ బ్యాన్‌పై వెనక్కి తగ్గని ఫిఫా!
* ఇండియాలో మ్యాచ్‌లు ఎక్కడ చూడాలంటే?:
* టీవీ ఛానళ్లు: జీ గ్రూప్‌కు చెందిన స్పోర్ట్స్ నెట్‌వర్క్ Unite8 Sports 1, Unite8 Sports 2 (HD ఫీడ్స్‌తో సహా) ఛానళ్లలో మ్యాచ్‌లు లైవ్ వస్తాయి. అలాగే కొన్ని సెలెక్టెడ్ మ్యాచ్‌లను ఉచితంగా DD Sports లో కూడా చూడొచ్చు.
* డిజిటల్/ఓటీటీ యాప్: మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో చూడాలనుకునే వారు ZEE5 యాప్ లేదా వెబ్‌సైట్‌లో టోర్నమెంట్ స్ట్రీమింగ్ పాస్ కొనుగోలు చేసి మొత్తం 104 మ్యాచ్‌లను హై-డెఫినిషన్ (HD) క్వాలిటీలో లైవ్ స్ట్రీమ్ ఎంజాయ్ చేయొచ్చు.
