బాలోగన్ రెడ్ కార్డుపై ట్రంప్ ఫోన్?.. అమెరికా ప్లేయర్ బ్యాన్‌పై వెనక్కి తగ్గని ఫిఫా!

బాలోగన్ రెడ్ కార్డుపై ట్రంప్ ఫోన్?.. అమెరికా ప్లేయర్ బ్యాన్‌పై వెనక్కి తగ్గని ఫిఫా!

Red Card Controversy: ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ స్టేజ్ కేవలం ఆటతోనే కాకుండా.. అంతర్జాతీయంగా రాజకీయ రచ్చకు కూడా వేదికైంది. అమెరికా స్టార్ స్ట్రైకర్ ఫోలారిన్ బాలోగన్ (Folarin Balogun) రెడ్ కార్డ్ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ఈ మ్యాటర్‌లో సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫిఫా ప్రెసిడెంట్ గియాని ఇన్ఫాంటినోకు ఫోన్ చేసి లొల్లి చేయడం.. ఆ వెంటనే ఫిఫా జుడీషియల్ బాడీ బాలోగన్ మీద ఉన్న -మ్యాచ్ నిషేధాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచంలో అగ్గి రాజేసింది.

బాలోగన్ రెడ్ కార్డ్ లొల్లి: 
జూలై 1న జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాపై అమెరికా 2–0తో గెలిచిన సంగతి ఎరుకే. కానీ, ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి డిఫెండర్ తారిక్ ముహారెమోవిచ్‌ను కాలితో తొక్కినందుకు (Stamping) యూఎస్ లీడింగ్ స్కోరర్ ఫోలారిన్ బాలోగన్‌కు రెఫరీ రెడ్ కార్డ్ ఇచ్చి గ్రౌండ్ నుంచి బయటకి పంపించేసిండు. అయితే ఫిఫా రూల్స్ ప్రకారం రెడ్ కార్డ్ వస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆడటానికి వీల్లేదు. కానీ, అమెరికాలో వరల్డ్ కప్ జరుగుతుండటం, బెల్జియంతో జరగబోయే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ చాలా కీలకం కావడంతో.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ఫిఫా బాస్‌కు ఫోన్ చేసి.. బాలోగన్ రెడ్ కార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రంప్ కోరినట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఇన్ఫాంటినో కూడా ఒప్పుకున్నాడు.

బెల్జియం, యూఈఎఫ్ఏ ఫైర్:
ట్రంప్ ఫోన్ చేసినాక ఫిఫా డిసిప్లినరీ కమిటీ ఆర్టికల్ 27ను ఉపయోగించి బాలోగన్ పై ఉన్న ఒక్క -మ్యాచ్ బ్యాన్‌ను ఒకే ఒక్క ఏడాది ప్రొబేషనరీ పీరియడ్‌తో సస్పెండ్ చేసింది. అంటే అతడు బెల్జియంతో మ్యాచ్ ఆడొచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఫిఫా నిర్ణయం చూసి బెల్జియం ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆశ్చర్యపోయినట్లు తెలిపింది. ఇదెక్కడి న్యాయమంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. యూరోపియన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ యూఈఎఫ్ఏ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఫిఫా ఇక్కడ ఒక రెడ్ లైన్ దాటేసిందని, ఇది ఫుట్‌బాల్ ఆటకే చెడ్డ పేరు తెస్తుందని మండిపడింది.

►ALSO READ | యూరో కప్ నాకు ఫిఫా టైటిల్‎తో సమానం: పోర్చుగల్ ఓటమి తర్వాత రొనాల్డో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇన్ఫాంటినో క్లారిఫికేషన్: 
ఈ వివాదంపై ఫిఫా ప్రెసిడెంట్ గియాని ఇన్ఫాంటినో మాట్లాడుతూ.. డోనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేసింది నిజమే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు నాతో మాట్లాడుతుంటారు.. కానీ, ఫిఫా కోర్టులు, జుడీషియల్ బాడీలు పక్కా స్వతంత్రంగా (Independent) పని చేస్తాయి. ఆ నిర్ణయంతో ట్రంప్ ఫోన్ కాల్‌కు ఎలాంటి సంబంధం లేదు.. ఒక్కోసారి ఆ కమిటీ ఇచ్చే నిర్ణయాలు చూసి నేను కూడా ఆశ్చర్యపోతా, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కానీ, రూల్ ఆఫ్ లాను గౌరవించాల్సిందేనని చెప్పుకొచ్చాడు.

1970 తర్వాత హిస్టారికల్ రికార్డ్:
ఆప్టా (Opta) స్పోర్ట్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. 1970లో ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఒక్క ప్లేయర్ కూడా రెడ్ కార్డ్ వచ్చిన వెంటనే నెక్స్ట్ మ్యాచ్ ఆడిన రికార్డు లేదు. ఒకవేళ సీటెల్‌లో బెల్జియంతో జరిగే మ్యాచ్‌లో అమెరికా తరఫున ఫోలారిన్ బాలోగన్ గనుక మైదానంలోకి దిగితే.. ఫిఫా 56 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే రెడ్ కార్డ్ వచ్చినా నెక్స్ట్ మ్యాచ్ ఆడిన మొట్ట మొదటి ప్లేయర్‌గా బాలోగన్ హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. మొత్తానికి అమెరికా పవర్‌తో ఫిఫా రూల్స్ మార్చేసిందంటూ నెట్టింట ఫుల్ ట్రోలింగ్ కొనసాగుతుంది.