హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్.. ఆన్ లైన్ బుకింగ్స్.. అత్యాధునిక సకర్యాలతో నడిచే స్పెషల్ బస్సులు

హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్.. ఆన్ లైన్ బుకింగ్స్.. అత్యాధునిక సకర్యాలతో నడిచే స్పెషల్ బస్సులు

హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. డైలీ షటిల్స్ పేరుతో ఐటీ ఎంప్లాయిస్ కోసం నడిచే బస్సులను మంగళవారం (జులై 07) రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ తో కలిసి jrc కన్వెన్షన్ లో ప్రారంభించారు. 

 డైలీ షటిల్స్ ద్వారా హైదరాబాదులోని వివిధ ఐటీ కారిడార్లకు ఉద్యోగస్తులు  రోజువారీగా సౌకర్యవంతంగా ప్రయాణించేలా ప్రత్యేక బస్సులను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. ఈ సేవల ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 

అత్యాధునిక సౌకర్యాలు, భద్రత ప్రమాణాలు, సమయపాలన, సీటింగ్, డిజిటల్ బుకింగ్ వంటి ప్రత్యేకతలతో ఉద్యోగులకు నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యం అని అన్నారు.   పర్యావరణ హితమైన స్మార్ట్ నగర రవాణా వ్యవస్థ అభివృద్ధి కి డైలీ  షీటిల్స్ ఒక కొత్త అడుగుగా నిలుస్తుందని అన్నారు.