న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా అతిథ్య జట్టుతో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. టీ20లు ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. జూలై 14న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ముందు భారత జట్టులో బీసీసీఐ ఒక స్వల్ప మార్పు చేసింది. జట్టు నుంచి స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్‌ను తప్పించింది. అతడి స్థానంలో డేంజరస్ ప్లేయర్ శివమ్ దూబేను ఎంపిక చేసింది.
తొడ కండరాల గాయంతో బాధపడుతోన్న నితీష్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నాటికి అతడు కోలుకునే అవకాశం లేదు. దీంతో నితీష్ స్థానంలో బీసీసీఐ దూబేను ఎంపిక చేసింది. దీంతో రెండేళ్ల తర్వాత భారత వన్డే జట్టులోకి దూబే రీ ఎంట్రీ ఇచ్చాడు. చివరగా అతడు 2024లో భారత్ తరుఫున వన్డే మ్యాచ్ ఆడాడు.
ఇండియా, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్
- 1వ వన్డే: జూలై 14 (ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్)
- 2వ వన్డే: జూలై 16 (సోఫియా గార్డెన్స్, కార్డిఫ్)
- 3వ వన్డే: జూలై 19 (లార్డ్స్, లండన్)
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కె. ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబే
