జ్యోతిష్యం : మీనరాశిలోకి చంద్రుడు..ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

జ్యోతిష్యం :  మీనరాశిలోకి చంద్రుడు..ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తొమ్మిది గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశిచక్ర గుర్తులను, నక్షత్రాలను మారుస్తాయి. చంద్రుడు తన రాశిని చాలా త్వరగా మారుస్తాడు. జులై 6 వ తేదీన ఉదయం 9.32 గంటలకు చంద్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. ఈ  మార్పు వలన ఆరు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగనున్నాయి.  ఇప్పుడు ఆ అదృష్టరాశుల గురించి తెలుసుకుందాం. . 

మిధున రాశి: చంద్ర సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి  అన్ని విధాలుగా శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులు..చేతి వృత్తుల వారి  సక్సెస్‌ను ఎవరూ ఆపలేరు. బిజినెస్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే కూడా బాగా కలిసి వస్తుంది.  ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.ఆర్థిక లాభాలు కలగనున్నాయి. శుభవార్తలు వింటారు. మనసు ప్రశాంతంగా మారుతుంది. . కుటుంబంతో ఎక్కువ సమయం సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వ్యాపారాలకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా.. మంచి విజయాలు అందుకుంటారు. 

కర్కాటకరాశి: చంద్రుడు  మీన రాశిలో సంచారం వలన   ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను కలుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  కోర్టు సంబంధిత విషయాల్లో మంచి పరిష్కారం లభిస్తుంది.  కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు తొలగుతాయి.  కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అన్ని విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు అందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

సింహరాశి:  చంద్రగ్రహం సంచారంలో మార్పు ..  వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాశం పెరిగే అవకాశం ఉంది.  తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా సానుకూల పలితాలుంటాయి.  సమాజంలో ఉన్నత వ్యక్తులు పరిచయవుతారు.  గౌరవ.. మర్యాదలు పెరుగుతాయి.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | Vastu Tips: కిచెన్.. డైనింగ్.. దేవుడి మందిరం ఒకే గదిలో ఉన్నాయా.. అయితే మీరు కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే..లేదంటే ఇబ్బందులు తప్పవు..!

కన్య రాశి :  మీన రాశిలో  చంద్రుడు సంచారం వలన  ఈ  రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. అనుకున్న పనులన్నీ చాలా త్వరితగతిన పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. గ్రహాల అనుకూలత అనేక విధాలుగా మీకు సహాయంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు.  పాత బకాయిలు వసూలవుతాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. 

వృశ్చికరాశి : మీన రాశిలో చంద్రుడు సంచారం వలన ఈ రాశి వారికి    అత్యంత ఫలవంతమైనది. సౌభాగ్యంతో పాటు లగ్జరీ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి  తగ్గుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆస్తికి సంబంధించి ఏదైన వివాదం నడుస్తుంటే అది పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులు తమ సీనియర్లను మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన పురోగతి ఉంటుంది.  ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా అనుకూలమైన సమయం.  ప్రైవేట్​ ఉద్యోగస్తులకు ప్రమోషన్​ రావడంతో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.

కుంభరాశి: చంద్రుడు  మీన రాశిలో సంచారం వలన  ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులు ఊహించని లాభాలు కలుగుతాయి.  విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది.పాత బకాయిలు  వసూలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు  ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.