Vastu Tips: కిచెన్.. డైనింగ్.. దేవుడి మందిరం ఒకే గదిలో ఉన్నాయా.. అయితే మీరు కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే..లేదంటే ఇబ్బందులు తప్పవు..!

Vastu Tips: కిచెన్.. డైనింగ్.. దేవుడి మందిరం ఒకే గదిలో ఉన్నాయా.. అయితే మీరు కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే..లేదంటే ఇబ్బందులు తప్పవు..!

హిందువుల ఇళ్లలలో కచ్చితంగా పూజగది..పూజ చేసేందుకు ప్రత్యేక స్థలం ఉంటుంది.  విశాలమైన ఇళ్లు ఉంటే సెపరేట్​ గా దేవుడి గది ఉంటుంది.  కాని మధ్య తరగతి ప్రజలు వారి బడ్జెట్​ కు లోబడి ఉన్న ఇంట్లోనే ఈశాన్యం దిక్కులో  చిన్నపాటి దేవుడి మందిరం ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తుంటారు. ఇది ప్రతి ఒక్కరి ఇంటిలో సాధరణంగా ఉంటుంది.  వాస్తు సిద్దాంతం ప్రకారం ప్రత్యేకంగా దేవుడి గది ఉన్న.. ఉన్న గదిలోనే దేవుడి మందిరం ఏర్పాటు చేసుకున్నా... కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు.  ఎట్టి పరిస్థితిలో ఆ ప్రదేశంలో ఈ పొరపాట్లు చేయవద్దని సూచిస్తున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .  .! 

హైదరాబాద్​.. బెంగళూరు.. ఢిల్లీ.. చెన్నై.. వంటి మహానగరాల్లో నివసించే చిన్న కుటుంబాలు ఒకే గదిలో ఉంటారు.  అదే గదిలో కిచెన్​.. డైనింగ్​..  తో పాటు.. పడుకోవడం అన్నీ ఆ గదిలో ఉంటాయి.  వీటితో ఆ గదిలోనూ పూజా స్థలం కూడా ఉంటుంది.  ఇలా ఉన్న ఇంటిలో కొన్ని సంప్రదాయాలు పాటించకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

దేవుడి మందిరానికి తప్పని సరిగా కర్టెన్​ ఏర్పాటు చేసుకోవాలి.  పూజ అయిన తరువాత అంటే దీపారాధన కొండెక్కిన తరువాత కర్టెన్​ వేయాలి.  దేవుడి మందిరం ఎదురుగా చీపురితో తుడవకూడదు.  ఒక క్లాత్​ తీసుకొని దానితో క్లీన్​ చేసుకోవాలి.  ఆస్థలాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.  అన్నం తిన్న తరువాత కచ్చితంగా తడి క్లాత్​ తో శుద్ది చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.   

హిందువులు  పూజ  చేయడం ఒక పవిత్రమైన క్రియగా భావిస్తారు.  భోజనం రోజూ చేసే కార్యమే అయినా, ఆహారం తీసుకోవడం వల్ల ఆ వాసనలు, శబ్దాలు, కొన్నిసార్లు అపరిశుభ్రత ఏర్పడే అవకాశం ఉంటుంది.
అందువలన  ఆ స్థలంలో శాంతికి భగ్నం కలిగే అవకాశం ఉంది.  అందుకే ఆ ప్రదేశాన్ని భోజనానికి ముందు.. తరువాత  వాటర్​ తో కచ్చితంగా శుద్ది చేయాలి.  అలానే వారానికి ఒకసారి పసుపు నీళ్లు చల్లాలి. 


వాస్తు శాస్త్రంలో పూజా మందిరం ఉన్న ప్రదేశం ఎలా ఉండాలో  కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి పూజ చేసుకొనేందుకు చాలా ప్రశాంతంగా ఉండే  స్థలాన్ని ఎంచుకోవాలి.   బాత్రూమ్‌లు..  శబ్దం వచ్చే ప్రదేశాల దగ్గర ఉండకూడదు. ఎందుకంటే పూజ చేసుకొనే సమయంలో సౌండ్​వస్తే ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది.  

ALSO READ : జ్యోతిష్యం:ఇంట్లో తరచూ గొడవలు ఎందుకొస్తాయి..వాటికి కారణం ఎవరు..

 వాస్తు ప్రకారం దేవుడి మందిరం ఉన్న గదిలో భోజనం చేయడం. పడుకోవడం తప్పు కాదు.  కాని ఆ గదిలో అవకాశం ఉన్నంత వరకు డిస్టెన్స్​ మెయింటైన్​ చేయాలి. పూజా మందిరం ఉన్న గది  శుభ్రంగా ఉన్నంత కాలం ఫర్వాలేదని చాలా మంది వాస్తు నిపుణులు చెబుతున్నారు.దేవుడి మందిరాన్ని కొంత ఎత్తులో ఉంచుకోవాలి.  దేవుడి మందిరం ఒక మూల ఉంటే మరో మూలలో భోజనం చేయాలని వాస్తు పండితులు చెబుతున్నారు. 


చిన్న ఇళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు

  • చాలామంది ఇళ్లలో పూజాగది సెపరేట్​ గా ఉండదు.  ఆ గదిలో  భోజనం చేసిన తరువాత కచ్చితంగా తడి క్లాత్​ తో శుద్ది చేసుకోవాలి.  అలాగే  వారానికి ఒకసారి పసుపు నీళ్లు చల్లుకోవాలి.  అంటు .. మైల వచ్చినప్పుడు ఆ గది అంతా తిరగకుండా ఉండాలి. 
  • దేవుళ్ల విగ్రహాల ముందు నేరుగా ఆహారాన్ని ఉంచడం మానుకోవాలి. నైవేద్యం పెట్టాలనుకుంటే.. ఒక ప్లేటులో ఆకు వేసి అందులో ఆహార పదార్దాలను ఉంచి నైవేద్యం పెట్టాలి.
  • మనం భోజనం చేసేటప్పుడు.. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కచ్చితంగా కర్టెన్​ వేయాలి. అంటే కర్టెన్​ను మందిరం ఎదురుగా కూర్చొని పూజ చేసుకొనే విధంగా తెరను ఏర్పాటు చేసుకోవాలి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.