Narne Nithiin: భారీ ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్టీఆర్ బామ్మర్ది.. బంపర్ ఛాన్స్ అందుకున్న నార్నే నితిన్‌!

Narne Nithiin: భారీ ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్టీఆర్ బామ్మర్ది.. బంపర్ ఛాన్స్ అందుకున్న నార్నే నితిన్‌!

నార్నే నితిన్ హీరోగా 'జూనియర్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విజయ్ 'జన నాయగన్", యష్ తో "టాక్సిక్' సినిమాలు చేసి ప్రస్తుతం చిరంజీవితో బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఆదివారం (జులై 6న) పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్ కు నిర్మాత వెంకట్ కె నారాయణ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. 'మ్యాడ్' దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రారంభ షాట్ కు గౌరవ దర్శక త్వం వహించాడు.

ALSO READ : Kalyan Ram: కళ్యాణ్ రామ్ డబుల్ ట్రీట్ అదిరింది.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ!

నితిన్ కెరీర్లో ఇది 5వ చిత్రం. అనికా సురేంద్రన్, మేఘా శెట్టి హీ రోయిన్స్ గా నటిస్తున్నారు. లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 'ఆంధ్రకింగ్ తాలూకా' చిత్రానికి సంగీతం అందించిన వివేక్, మెర్విన్ ద్వయం దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. 

రొమాన్స్, కామెడీ, మనసుని హత్తుకునే భావోద్వేగాల కలయికతో బలమైన ఎమోషనల్ అంశాలతో కూడిన కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.