జ్యోతిష్యం:ఇంట్లో తరచూ గొడవలు ఎందుకొస్తాయి..వాటికి కారణం ఎవరు..చేయాల్సిన పరిహారాలు ఇవే..!

జ్యోతిష్యం:ఇంట్లో తరచూ గొడవలు ఎందుకొస్తాయి..వాటికి కారణం ఎవరు..చేయాల్సిన పరిహారాలు ఇవే..!

ప్రతి ఇంట్లో దంపతుల మధ్య అలకలు మామూలే.. అలాంటి చిన్న చిన్నవి గంట.. రెండు గంటల్లోనే పరిష్కారమవుతాయి.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారి కుటుంబసభ్యుల మద్య తరచూ గోడవలు.. అనేక సమస్యలు వస్తాయి.  శుక్రదోషం ఉన్న వారికి వచ్చే ఇబ్బందులు సమస్యలు ఏమిటి.. వారుఎలాంటి పరిష్కారాలు చేయాలి.. మొదలుగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . ! 

జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు ఇంట్లో అనుబంధాలు సరిగా ఉండవని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఎప్పుడూ తగాదాలు ఉంటాయి.  ఆహారం కూడా సరిగా తినలేరు.  ఆ ఇంట్లోని , మగ పిల్లలు కి పెళ్లి  ఇబ్బందులు ఉంటాయి. శుక్ర దోషంతో ఇబ్బంది పడే వారికి   కంటికి సంబందించిన అనారోగ్యము కలుగుతుంది. వాహన సౌఖ్యము లేకపోవడం జరుగుతుంది. 

తరచూ భార్యా భర్తల మధ్య అన్యోన్యత లేక చీటికి మాటికి గొడవలు అవుతాయి.  ఒక్కోసారి ఈ సమస్యలు జఠిలంగా మారి విడిపోయే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  అనేక రకాలైన చెడు అలవాట్లకు బానిసలుగా మారుతారు. ఇంకా  వివాహం ఆలస్యం అగుట, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, అంటు రోగాలు  కుటుంబంలోని మహిళలకు అనారోగ్యము ఇలాంటి సమస్యలు ఉంటే అలాంటి వారి కుటుంబసభ్యుల జాతకంలో  శుక్రుడు బలహీనంగా ఉన్నాడని గుర్తించాలని పండితులు చెబుతున్నారు. 

శుక్ర ప్రభావం వల్ల గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాదులు ఏర్పడతాయి.  గొంతు నొప్పి. టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలగు వాటితో తరచూ ఇబ్బందులు ఉంటాయి.. ఇంకా  నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం,  సంతాన లేమి మొదలైన వ్యాధులకు శుక్రుడు కారకుడని పండితులు చెబుతున్నారు.

 చేయాల్సిన పరిహారాలు

  •  శుక్రుడిని పూజించడం ద్వారా శుక్ర తోష దోషాలు తగ్గుతాయి.
  •  శుక్రవారాలలో ఉపవాసంతో తెల్లని వస్త్రాన్ని ధరించి, తెల్లని  పువ్వులతో శుక్రుడిని పూజించాలి.  
  • శుక్రవారం ప్రదోష కాలంలో అమ్మవారిని తామరపువ్వులో పూజిస్తే చాలా మంచిది.
  • శనగలు దానం చేయాలి
  •  శుక్రవారాల్లో ఉపవాసం ఉండి, ఇంట్లోని పూజా మందిరంలో మహాలక్ష్మి చిత్రపటానికి అలంకరించి, నెయ్యి దీపం వెలిగించి, మహాలక్ష్మీ స్తోత్రం ,కనకధారా స్తోత్రం పఠించి, పాల పాయసం సమర్పించాలి.
  • ప్రతి రోజూ రాత్రి పప్పును నీళ్లలో నానబెట్టి, ఉదయం ఆ పప్పును ఆవుకు తినిపించండి. దీంతో శుక్రదోషం తగ్గిపోతుంది
  • సోమవారం.. ఏకాదశి.. పౌర్ణమి.. మాస శివరాత్రి రోజుల్లో అర్థనారీశ్వర తత్త్వం కలిగిన శివలింగానికి ...ఆవు పాలతో  అభిషేకం చేస్తూ 108 సార్లు.. " ఓం అర్దనారీశ్వరాయ నమః  అనే మంత్రం పఠించాలి
  •  పండ్లను ప్రసాదంగా  పెట్టి ..అందరికి పంచాలి
  •  11 శుక్రవారాలు వైభవ లక్ష్మీ ఉపవాసం ఆచరించండి. ఇది శుక్రుడిని సంతోషపరుస్తుంది. 
  •   రొట్టెలకు నెయ్యి పూసి, బెల్లం మొదలగు వాటిని గోమాతకు ఆహారంగా ఇవ్వండి.
  • ప్రతిరోజు ‘ఓం శుక్రాయన నమ:’ అనే మంత్రాన్ని జపించాలి.
  • శుక్రవారం నాడు పేదవారికి .. బ్రాహ్మణులకు  బియ్యం, పాలు, పెరుగు, లేదా తెల్లని వస్త్రాలను దానం చేయాలి
  • వజ్రంతో తయారు చేసిన ఉంగరాన్ని ధరించాలి.. చాలా ఖరీదు కనుక అమెరికన్​ డైమండ్​ మార్కెట్లో దొరుకుతుంది.  కాని వీటిని ధరించేటప్పుడు కచ్చితంగా జపాలు.. దానాలు చేయాలి.

శుక్రగ్రహ నివారణ కోసం చేయాల్సిన కార్యక్రమాల్లో ఇది ఒకటి. మేడి చెట్టు శుక్రుని వృక్షము. ప్రతి శుక్రవారం ఉదయం అయిదున్న నుంచి ఆరున్నర లోపు చిన్న రాగి లేదా ఇత్తడి, స్టీల్..(ఇందులో ఏదైనా పర్వలేదు) చెంబు తీసుకుని దానిలో నీటిని పోసి గంధం కలిపి, ఆ నీటిని మేడి చెట్టుకు పోయాలి. అక్కడే దీపం వెలిగించాలి. దానిని పూజించి రావాలి. ఇలా చేసిన రోజు సాయంత్రం తెల్లటి గుడ్డ, శనగలు దానం ఇవ్వండి. ఇలా పదహారు వారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల వారి శుక్ర దోషానికి పరిహారమగునని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.