కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‎కు సీఎం రేవంత్ లేఖ

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‎కు సీఎం రేవంత్ లేఖ

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‎కు సంబంధించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‎కు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. 2026, జూన్‎లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ అధ్యయన బాధ్యతలు ఎస్‎బీఐ క్యాప్స్‎కు అప్పగించాలని కోరారు.

ఇందుకు సంబంధించిన షరతులు, విధివిధానాలు వెంటనే ఖరారు చేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ టేకోవర్, రెండో దశ అనుమతులు జాప్యం అవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రులను లేఖల్లో కోరారు.