వారఫలాలు ( జులై 511): ఈ వారం గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం వంటి రంగాల్లో శుభఫలితాలు కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుతో ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది.12 రాశుల వారి వారఫలాలను తెలుసుకుందాం..!
మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలుంటాయి.ఆదాయానికి మించిన ఖర్చులు. కార్యక్రమాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. . వృత్తి, వ్యాపారాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలో కూడా ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈవారంలో ఆశించిన ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. మీకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. చేపట్టిన పనులను గుడవులోగా పూర్తిచేసే పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులు ఎక్కువుగా లాభాలు పొందుతారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో సానుకూల ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: ఈ రాశి వారు ఈ వారంలో కెరీర్ పరంగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. జాబ్ లో కొత్త బాధ్యతలతో పాటు వేతనం కొద్దిగా పెరుగుతుంది. ఉన్నతాధాకారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఆఫీసులో కీ రోల్ పోషిస్తారు. ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే కొద్దిగా ఇబ్బందులు వచ్చినా లాభాలు గడిస్తారు. తోబుట్టువుల సహకారం ఉంటుంది. ఈ వారంలో విలువైన వస్తువులు కొనేందుకు ప్లాన్ వేస్తారు. పెళ్లి సంబంధం చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి : ఈ వారంలో ఈ రాశి వారు అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. వారం మధ్యలో నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందని పండితులు చెబతున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఆందోళన చెందవద్దు.. ఆధ్యాత్మిక చింతనతో గడపండి అంతా మంచే జరుగుతుంది.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది.
కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడి పెట్టడానికి అనువైన సమయం. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంతో కలిసి కొత్త వాహనం ..ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కన్యారాశి : ఈ రాశి వారు ఈ వారం తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమమవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
తుల రాశి: ఈ రాశి వారికి ఈ వారం మీరు చేపట్టిన పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ మాటతీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వారం సాఫీగా సాగిపోతుందని పండితులు చెబుతున్నారు.
వృశ్చికరాశి: ఈ రాశి వారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి... వ్యాపారాలు సామాన్యంగా సాగిపోతాయి. ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగపరంగానూ, ఆర్థికంగానూ ఆశించిన స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సూచనలున్నప్పటికీ మొత్తం మీద వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. . ప్రేమ వ్యవహా రాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి. ఈ వారం ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
ధనస్సురాశి: ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఈ వారం మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పోతుంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
మకర రాశి: ఈ వారంలో ఈ రాశి వారికి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబపరంగా ఉన్న చిక్కుముళ్లు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేపడితే ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. భూ లావాదేవీల వ్యవహారంలో సానుకూల ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు ఆశించన జాబ్ లభిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా పరవాలేదనిపిస్తాయి. . ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
మీనరాశి : ఈ రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. కొత్త పెట్టుబడుల విషయంలోఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు. విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి. వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. స్థిర ఆస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
