వరల్డ్‌కప్‌లో అసలైన వార్ స్టార్ట్.. ఒక్కో మ్యాచ్ ఫైనల్‌లా.. రౌండ్ ఆఫ్ 16 పూర్తి షెడ్యూల్ ఇదే!

వరల్డ్‌కప్‌లో అసలైన వార్ స్టార్ట్.. ఒక్కో మ్యాచ్ ఫైనల్‌లా.. రౌండ్ ఆఫ్ 16 పూర్తి షెడ్యూల్ ఇదే!

FIFA World Cup 2026 Round of 16: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026)లో ఉత్కంఠభరితమైన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి రౌండ్ ఆఫ్ 16 పైకి మళ్లింది. ప్రపంచకప్ ట్రోఫీ రేసులో ప్రస్తుతం 16 జట్లు మిగిలి ఉన్నాయి. ఈ రౌండ్ ఆఫ్ 32లో నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన జర్మనీని పరాగ్వే ఓడించడం, అలాగే నెదర్లాండ్స్‌పై మొరాకో పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించడం ఈ టోర్నీలోనే హైలెట్ గా నిలిచాయి. ఇకపై ట్రోఫీని ముద్దాడటానికి జట్లు కేవలం నాలుగు విజయాల దూరంలో మాత్రమే ఉన్నాయి.

రౌండ్ ఆఫ్ 16లో లీగ్ హైలైట్స్: 

* కెనడా వర్సెస్ మొరాకో: జూలై 4న జరిగే ఈ మ్యాచ్‌తోనే రౌండ్ ఆఫ్ 16 పోరు ప్రారంభం కానుంది.

* పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్: జూలై 7న జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పోర్చుగల్ ఇప్పటివరకు ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. క్రిస్టియానో రొనాల్డోకు ఇది చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉండటంతో, ఈ లెజెండ్ కోసం కప్పు గెలవాలని పోర్చుగల్ కసితో ఉంది. అయితే, ప్రస్తుత ఫామ్ ప్రకారం స్పెయిన్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

* అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్: డిఫెండింగ్ ఛాంపియన్ అయిన అర్జెంటీనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి లేకుండా దూసుకుపోతోంది. రౌండ్ ఆఫ్ 32లో కేప్ వెర్డే జట్టు అర్జెంటీనాకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఎలాగోలా బతికి బయటపడింది. ఇప్పుడు వారు మహ్మద్ సలాకు చెందిన ఈజిప్ట్ జట్టుతో తలపడనున్నారు.

* ఇంగ్లాండ్ వర్సెస్ మెక్సికో: డీఆర్ కాంగోను ఓడించి ఇంగ్లాండ్, ఈక్వెడార్‌పై గెలిచి మెక్సికో ఈ రౌండ్‌కు క్వాలిఫై అయ్యాయి. 1966 తర్వాత రెండోసారి ప్రపంచకప్ గెలవాలని ఇంగ్లాండ్ చూస్తుండగా, మెక్సికో తన క్వార్టర్ ఫైనల్ రికార్డును (1970, 1986) తిరగరాయాలని భావిస్తోంది.

* ఇతర మ్యాచ్‌లు: ఫ్రాన్స్ జట్టు పరాగ్వేతో, బ్రెజిల్ జట్టు ఎర్లింగ్ హాలాండ్‌కు చెందిన నార్వే జట్టుతో తలపడనున్నాయి.

రౌండ్ ఆఫ్ 16 పూర్తి షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం):

* జూలై 4 (శనివారం): కెనడా వర్సెస్ మొరాకో– రాత్రి 10:30 గంటలకు
* జూలై 5 (ఆదివారం): పరాగ్వే వర్సెస్ ఫ్రాన్స్–  తెల్లవారుజామున 2:30 గంటలకు
* జూలై 6 (సోమవారం): బ్రెజిల్ వర్సెస్ నార్వే–  తెల్లవారుజామున 1:30 గంటలకు
* జూలై 6 (సోమవారం): మెక్సికో వర్సెస్ ఇంగ్లాండ్–  తెల్లవారుజామున 5:30 గంటలకు
* జూలై 7 (మంగళవారం): పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్–  అర్ధరాత్రి 12:30 గంటలకు
* జూలై 7 (మంగళవారం): యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బెల్జియం–  తెల్లవారుజామున 5:30 గంటలకు
* జూలై 7 (మంగళవారం): అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్–  రాత్రి 9:30 గంటలకు
* జూలై 8 (బుధవారం): కొలంబియా vs స్విట్జర్లాండ్–  తెల్లవారుజామున 1:30 గంటలకు

రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన జట్లు ఇవే:
* కెనడా 
* మొరాకో 
* పరాగ్వే 
* ఫ్రాన్స్ 
* బ్రెజిల్ 
* నార్వే 
* మెక్సికో 
* ఇంగ్లాండ్ 
* పోర్చుగల్ 
* స్పెయిన్ 
* అర్జెంటీనా 
* ఈజిప్ట్ 
* కొలంబియా 
* యునైటెడ్ స్టేట్స్ (USA) 
* బెల్జియం 
* స్విట్జర్లాండ్.