కరీంనగర్: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. వేములవాడ డిపోకు చెందిన బస్సు కరీంనగర్‌కు వస్తుండగా ముందున్న టిప్పర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. టిప్పర్ను తప్పించబోయిన బస్సు అదుపు తప్పి డివైడర్, విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో విద్యుత్ స్తంభం అడ్డుగా నిలవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులోని 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : హైదరాబాద్ లో భార్యను చంపిన భర్త...
టిప్పర్ డ్రైవర్ తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు. ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది గానీ ఏదైనా ఘోరం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే బస్సు ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సులో వృద్ధులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
